గతకాలపు ప్రేయసి

z1ROOFo5VRg_Fullకాదంటూ వెళ్ళిపోయిన ప్రేయసి జ్ఞాపకం
వచ్చి పలకరించే కెరటం లాంటిది.
జీవితాంతం మనతో ఉండమన్నా ఉండదు
వద్దన్నా జీవితమంతా వచ్చి యదను మీటుతూనే ఉంటుంది.

సాష్టాంగ నమస్కారం చేసా
శరను అని “మరుపు”ని వేడుకున్నా
మొహం చాటేసి వికటాట్టహాసం చేస్తూ వెళ్ళిపోయింది
చీకటి నా చుట్టూ కమ్ముకుంది.

-వెంకటేష్ వీరా

॥ ఇదిగో ఓ తెలిసిన మనిషి॥

గుర్తుంచుకుంటా
నాకు నువ్వు ఇవ్వని నీ సమయాన్ని
అదేదో కసితో ప్రతీకారం తీర్చుకోవాలని కాదు
నాకు కలిగాన బాధకి ఆనందం ఎలా ఉంటుందో పరిచయం చెయ్యాలని
భవిష్యత్తులో ఏదో రోజు నీ విలువైన ఆ కాలాన్ని హుందాగా లాక్కుంటా
అప్పుడు ఆక్షణాన నువ్వు మరచిపోయిన ఆ మొన్నటి నీ వేళని నీకు పరిచయం చేస్తా 😊

-వెంకటేష్ వీరా

॥ నిద్ర ॥

ఒకప్పుడు
నాతో ఉంటూంటే వద్దని పొమ్మన్నా
నావైపు జాలిగా చూస్తూ నడిచి వెళ్ళిపోయింది
కొన్నేళ్ళు బాగానే ఉన్నా
తను ఉందని గుర్తుండేది కాదు
ఏమైందో ఈ మధ్య తనతో ఉండాలనిపిస్తుంది
నిన్న సిగ్గువిడిచి రమ్మని పిలుస్తే పలకరించింది
ఉంటుందేమో అనుకున్నా, మోసం చేసి
ఒంటరిగా వదిలేసిపోయింది.

-వెంకటేష్ వీరా

Happy Men’s Day

కన్నీళ్ళని దిగమింగే వాళ్ళు
కష్టం వస్తే మేమున్నాం అంటూ నిలబడే వాళ్ళు
కుటుంబం కోసం సంతోషంగా కోర్కెలు వదులుకునే వాళ్ళు
ప్రేమ అనే రెండు అక్షరాల విలువ తెలిసి మొసం కూడా మరచిపోయే వాళ్ళు
స్నేహం అంటే ప్రాణం పెట్టే వాళ్ళు
.
.
రోజూ లేనిపోని వార్తల్లో నలిగిపోయేది కూడా వాళ్ళే 🙏🏽
#HappyMensDay

చిన్న జీవితం

త్రుణ ప్రాయంలొ కనుమరుగయ్యే వాళ్ళం..

ఎందుకీ?
అనవసరపు ఆలోచనలు
అర్థం లేని భయాలు
చిన్న చిన్న వాటికి జీవితం తలకిందులైపోతుందేమో అన్న ఊహలు

మర్చిపోదాం మన మనసుకి నచ్చిన వారితో మనస్పర్ధలు
మాట్లాడుకుందాం ఉన్ననాళ్ళు ఈ అందమైన భూప్రపంచంలో
ప్రేమిద్దాం మనా అనుకునే వాళ్ళని 😊
మనుషులే ముఖ్యం.

-VenkateshVeera

॥నూతన ప్రారంభం॥

నేను నడుస్తున్నాను.

పాతబాధల్ని వెనక్కి నెట్టి కొత్త ఉదయం వైపు.
నేను నడుస్తున్నాను.
నిన్నటి గుండెల్ని పిండే జ్ఞాపకాల నుంచి ఆనందపు గడియల వైపు.
నేను నడుస్తున్నాను.
వంచన చేసిన మనుషుల నుండి మంచి ప్రదేశాల వైపు.
నేను నడుస్తున్నాను.
బారంగా గడుస్తున్న దినముల నుంచి ఆహ్లాదపు రోజుల వైపు.
నేను నడుస్తున్నాను.
మొన్నటి నేనుకు సెలవని చెప్పిరేపటి సరికొత్త నా వైపు.

-వేంకటేష్ వీరా

॥ గుర్తుందా? ॥

ఒక్కసారి అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో…
కాలం విసిరిన ప్రతీ తుఫానుని ఎల గుండె ధైర్యంతొ అదిగమించావో గుర్తొస్తుంది!!

నీ జీవితం… నువ్వే పోరాడాలి…
పడిపోయావా??? పరవాలేదు లే…
మళ్ళీ ప్రయత్నించు…
ఎవడు నిన్ను ఆపేది నీకు నువ్వు తోడుండగా.

-వెంకటేష్ వీరా